బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆఖరుగా షారుఖ్ ఖాన్ 'జీరో' సినిమాలో నటించి  ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మాత్రం రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి పఠాన్ కాగా, రెండవది అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే సౌత్ కు చెందిన నటీనటులే ఎక్కువగా ఈ సినిమాలో ఉండేటట్లు దర్శకుడు జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే సినిమాకు లయన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆ వార్తలను కొంతమంది నమ్మలేదు. ఇది ఇలా ఉంటే జాతీయ మీడియా ప్రూఫ్ తో సహా ఈ టైటిల్ ని నిరూపించే ప్రయత్నం చేసింది. పూణే లో సినిమా షూటింగ్ కోసం స్థానిక అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అనుమతుల కోసం షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ వారు ఒక దరఖాస్తును పెట్టారు. ఆ దరఖాస్తులో సినిమా పేరును లయన్ గా పేర్కొన్నారు. సాధారణంగా అయితే ప్రొడక్షన్ నెంబర్ అని రాస్తూ ఉంటారు. కానీ ఇలా టైటిల్ రాయడంతో ముందుగానే సినిమా పేరును అనుకున్నట్లు తెలుస్తోంది. లయన్ పేరుకు బాగా హైప్ తీసుకువచ్చే ఆ తర్వాత విడుదల చేయాలి అని యూనిట్ సభ్యులు అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలా అనూహ్యంగా సినిమా పేరు బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పేరును మార్చే అవకాశం కూడా ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. లయన్ లాంటి పవర్ఫుల్  టైటిల్ ను షారుక్ ఖాన్ సినిమాకు పెట్టినందుకు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: