ప్రస్తుతం వెండితెరపై స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా హోస్ట్ గా బిగ్బాస్ మొదటి సీజన్ లో అదరగొట్టారు అన్న విషయం తెలిసిందే. తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రతి సామాన్యుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రస్తుతం ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.  ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కలలను సాకారం చేసుకునేందుకు గేమ్ ఆడుతున్నారు. ఇకపోతే ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం మొన్నటి వరకు తక్కువ టిఆర్పి సొంతం చేసుకుంది. కానీ ఇక వరుసగా స్పెషల్ గెస్ట్ లను ఎన్టీఆర్ ఇన్వైట్ చేస్తూ ఉండడంతో ఇక ఈ షో రేటింగ్ అంతకంతకూ పుంజుకుంటుంది. ఇక ఇటీవల ఈ షోకి ఇద్దరు స్పెషల్ గెస్ట్ లు ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న రాజమౌళి, కొరటాల శివ లను స్పెషల్ గెస్ట్ లుగా పిలిచి హాట్ సీట్లో కూర్చోబెట్టారు ఎన్టీఆర్  దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అయితే ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే హాట్ సీట్లో కూర్చున్న వారు ఎన్టీఆర్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇటీవలే స్పెషల్ గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి కొరటాల శివ లు కాసేపటి వరకు రూల్స్ ఫాలో అవకుండా ఎన్టీఆర్ని ఆట పట్టించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇద్దరు డైరెక్టర్లకు స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఇక్కడ బాస్ లొకేషన్ నాది డైరెక్షన్ నాది ఇక్కడ నేను చెప్పినట్లు వినాలి అంటూ డైరెక్టర్లకు షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. దీంతో ముగ్గురు నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: