టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. ఆ క్రమంలో ఇప్పటి వరకు భారీ ఫ్లాప్ లు అందుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా గల్లీ రౌడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం తో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమా ఫ్లాప్ టాక్ మొదటి షో నుంచి వినిపిస్తుండటంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా పరుగులు పెడుతుంది.

ఇటీవలే A1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో ప్రేక్షకులను బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సందీప్ ఇప్పుడు మరొక సినిమా ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . చిన్నపాటి గల్లీ రౌడీ గా చలామణి అవుతున్న సందీప్ కిషన్ హీరోయిన్ కు అనుకోకుండా వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసే క్రమంలో పెద్ద రెడీ అవుతాడు. ఈ నేపథ్యంలో సిటీ లో ఉన్న ఓ పెద్ద రౌడీని ఎదురించి ఆయన భారీ నుంచి హీరోయిన్ కుటుంబాన్ని ఏవిధంగా కాపాడాడు అనేదే ఈ సినిమా. స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించే విధంగా సందీప్ కిషన్ ఈ సినిమా చేయగా ఈ సినిమా కథ లోపం వల్ల ఫ్లాప్ అయిందని తెలుస్తుంది.

హీరోయిన్ మిగతా పాత్రధారులు ప్రేక్షకులను బాగానే అలరించిన కూడా ఈ సినిమా కథ లోపం వల్ల స్క్రీన్ ప్లే లోపం వల్ల భారీగా ఫ్లాప్ అయ్యింది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్ బాబీ సింహ ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. టీజర్ ట్రైలర్ లతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రం వారిని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ వారం కూడా సిటిమార్ హవానే కొనసాగుతుందని ఈ ఫలితాలను బట్టి చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: