మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈలోపు చిరంజీవి తన తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా పలు కారణాల వల్ల ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేశారు. మధ్యలో ఎక్కడ గాప్ లేకపోవడంతో ఆచార్య సినిమా వేసవికి విడుదల చేయాలని భావించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మూడు సినిమాలను సెట్స్ మీదకు వెళ్లే విధంగా చిరంజీవి ప్రణాళికలు రచించాడు. మొదటగా మోహన్ రాజా దర్శకత్వంలో రాబోయే గాడ్ ఫాదర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత మెహర్ రమేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు చిరు. ఒకేసారి ఈ చిత్రాలను పూర్తి చేసే విధంగా ఆయన ప్లాన్ చేశాడని తెలుస్తుంది. 

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో స్పెషల్ చిత్రంగా తెరకెక్కుతోంది బాబీ దర్శకత్వంలోనీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే వాల్తేరు వీరన్న సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం లో నటిస్తున్నాడని వార్తలు రాగా బాబీ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో ఈ చిత్ర కథను తయారు చేశాడట. పవర్ జై లవకుశ వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించగా బాబి ఈ చిత్రాన్ని కూడా మాస్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓ సమస్యలో చిక్కుకుంది అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా కథలో కొన్ని అంశాలు చిరంజీవికి నచ్చడం లేదని వాటిని మార్చాలని బాబీకి సూచించాడని అని తెలుస్తుంది. మరి అవి మార్చి బాస్ ను బాబీ మెప్పిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: