టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు అనగానే మాస్ మసాల చిత్రాలు చేయడమే ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో హీరోలు ఎక్కువగా ఈ చిత్రాలు మాత్రమే చేస్తూ తమ క్రేజ్ ను పాన్ ఇండియా వైడ్ గా పెంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు దీనికి భిన్నంగా హీరోలు వ్యవహరించేవారు. హీరో అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని జోనర్ ల సినిమాలలో నటించి మెప్పించాలి.  అంతే కానీ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించొద్దు.

ఇది మన పాత హీరోలు నమ్మే సిద్ధాంతం. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి మహానటులు గా మిగిలిపోయారు. అలా ఇప్పటి తరం హీరోలు ఆలోచించడం లేదు.  వివిధ రకాల జోనర్ లలో సినిమాలను చేయడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు వీరు.  ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ లోని సినిమాలను స్టార్ హీరోలు చేయకపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. 

మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు ప్రతి ఒక్కరు కూడా మాస్ చిత్రాలను హీరో ఎలివేషన్ ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా మన హీరోలు కనిపించడమే మానేశారు. దర్శకులు కూడా ఈ విధమైన కథను తయారు చేయడం అపేసిన్నట్టు ఉంది అందుకే ఇలాంటి కథలు కూడా పెద్దగా పుట్టుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పెద్ద హీరోలు ఇలాంటి జోనర్ లలో సినిమాలు చేసే రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు అందరూ మాస్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టారు అనేది మాత్రం నిజం. పోనీ ఈ చిత్రాలతో సక్సెస్ రేట్ ఏమైనా పెరిగిందా అంటే గతంలో కంటే చాలా తగ్గిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: