టాలీవుడ్ చందమామ అ ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల సంఖ్యను చేతిలో ఉంచుకుంది తెలుగులో ఆమె చిరంజీవి ఆచార్య సినిమా తప్ప పెద్దగా ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందని అందరూ భావించగా సడన్గా ఆమె తన సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చి ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను ఏర్పరచుకుంది.

గ్లామర్ పాత్రలు నటనకు ఆస్కారమున్న పాత్రను కూడా చేస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించే నటి కాజల్. ఈమె సినిమా ల్లో నటిస్తే చాలు ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తామని అన్నట్లుగా మన ప్రేక్షకులు ఆమె సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసే వారు. ఆ విధంగా ఆమె పెళ్లి చేసుకోవడం ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టినట్లూ అయింది. ఏదేమైనా ఆమె పెళ్లి చేసుకోవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి కానీ సినిమాలు తగ్గించడమే కొంత నిరాశ కలిగిస్తుంది.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషలలో సైతం ఈమె సినిమాలు తీసి అక్కడ భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవలే ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటించడం మొదలు పెట్టింది. వెండి తెరపై కాకుండా ఓ టీ టీ తెరపై అయినా ఆమెను చూసి తరించవచ్చి అన్న అభిమానుల ఆశ ఇక నెరవేరనట్లే కనిపిస్తుంది. కాజల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవడం లేదట. సినిమాల సంఖ్య తగ్గించడమే కాకుండా బయట కనిపించడం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కూడా ఆమె తగ్గించేసింది ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ ఎప్పుడు సినిమాలలో చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: