మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది, కాకపోతే కరోనా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్సినిమా తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఒక  సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

సినిమా ఈ మధ్యె లాంఛనంగా ప్రారంభం కూడా అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రన్ బీర్ కపూర్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ 'ఓటిటి' దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ తెలుగు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడానికి రామ్ చరణ్ ని రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందుకోసం రామ్ చరణ్ తో తాజాగా ఒప్పందం కూడా కుదుర్చుకునట్లు తెలుస్తోంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ తన కార్యకలాపాలను తెలుగు భాషలో మరింత ఉదృతం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో భాగంగా మెజీషియన్ గా డీస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సంబంధించిన ప్రచార చిత్రంలో కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రకటన జనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: