గత వారం వినాయక చవితి సందర్భంగా సిటి మార్, తలైవి సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అదే రోజు 'టక్ జగదీష్' ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయినప్పటికీ జనాలు థియేటర్లలో సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపారు. మరియు ఈ సినిమాలకు మొదటి రోజు మంచి కలెక్షన్లు కూడా వసూలు అయ్యాయి. ఈ రెండు సినిమాలలో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన 'సిటీ మార్' సమంచి సినిమాగా పేరు తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
గతవారం థియేటర్ల వద్ద మంచి క్రేజ్ ఉన్న రెండు సినిమాలు రావడంతో థియేటర్ల వైపు జనం ఆసక్తి చూపారు.  ప్రస్తుత వారం మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే ఈ వారం థియేటర్లలో సినిమాల కంటే ఎక్కువగా 'ఓటిటి' లోనే సినిమాలు విడుదల అయ్యాయి. ఇలా ఈ వారం 'ఓటిటి' లలో విడుదలయ్యే కొన్ని సినిమాల గురించి మనం తెలుసుకుందాం.

మాస్ట్రో : నితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో తమన్నా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. హిందీ సినిమా 'అంధాదున్' కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్మింగ్ అవుతుంది.

అనబెల్ సేతుపతి : విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17 తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రజలలో మంచి అంచనాలే ఉన్నాయి.

ప్రియురాలు : ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీ నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇలా ఈ వారం దియేటర్లకు కంటే 'ఓటిటి' హవానే ఎక్కువ నడుస్తోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: