మన టాలీవుడ్ హీరోలు పాత్రలకు కు తగ్గట్లు తమను తాము మార్చుకుంటున్నారు.అయితే హీరోల పాత్రలో వైవిధ్యం అంటే.. అది లుక్ కానీ బాడీ ల్యాంగ్వేజ్ కానీ మాట్లాడే తీరు అంటే యాస.ఈ మూడు వేరియేషన్స్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు మన హీరోలు.అయితే వీటితోనే సక్సెస్ లను అందుకుంటున్నారు. వీటిలో ఏది మిస్ అయినా ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది.ఇలాంటి దెబ్బలు గతంలో చాలామంది హీరోలకు తగిలాయి.ఆ హీరోలలో మన న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు.ఈ విషయంలో ఒక్కసారి కాదు రెండు సార్లు దెబ్బలు తిన్నాడు మన నాని.అయితే ఇప్పుడు మెల్లగా వాటినుండి తేరుకొని తన యాస ను మారుద్దాం అని అనుకుంటున్నాడట ఈ హీరో.

ఇటీవల కాలంలో నాని సినిమాల ఎంపిక విషయంలో రకరకాల వార్తలు,చర్చలు వస్తున్నాయి.వరుస సినిమాలు చేస్తున్నా..సరైన విజయం దక్కడం లేదు. అందుకే ఇలాంటి వన్నీ జరుగుతున్నాయి.ఏ సినిమాలో చూసినా నాని ఒకే విధంగా కనిపిస్తున్నాడని అంటున్నారు.అయితే నాని కి ఇవన్ని ఇప్పుడు అర్థం అయ్యాయేమో..తన కొత్త సినిమా కోసం యాస మార్చి.. తానేంటో నిరూపించాలని అనుకుంటున్నాడట.ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అనే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాని.ఈ సినిమాకి 'దసరా' అనే టైటిల్ ని కూడా పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్..

తన తొలి సినిమాలో నాని ని తెలంగాణా కుర్రాడిలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.అటు నాని కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇక్కడున్న మెయిన్ డౌట్ ఒకటే.గతంలో నాని ఇప్పటికే 'జెండాపై కపిరాజు,' 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాల్లో కొన్ని యాస లను  మాట్లాడాడు. ఆ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.ఇక ఈసారి తెలంగాణ యాసను మాట్లాడనున్నాడు.మరి ఈసారి తెలంగాణ యాస అయినా నాని ని గట్టెక్కిస్తుందేమో చూడాలి.ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: