బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ కారణంగా ఆయన ఏదైనా కమర్షియల్ యాడ్ లలో నటించాడంటే వాటి ప్రభావం జనాలపై భారీగా ఉంటుంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా యాడ్ చేశారు. రణవీర్ సింగ్, అమితాబ్ బచ్చన్ కలిసి చేస్తున్న పాన్ మసాలా యాడ్ షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతా నుండి చేసిన ఒక పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు ఈ యాడ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ పోస్ట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ 'థాంక్యూ సర్, ఒక్క విషయం అడగాలి ? మీకు ఏం తక్కువైంది ? మీరు కూడా కమల పాన్ మసాలా యాడ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీకు ఈ గులకరాళ్లకు మధ్య తేడా ఏమిటి?" అంటూ సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నించారు.

నెటిజన్ ప్రశ్నకు అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ 'మన్వార్ నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని చేయకూడదని మీకు అనిపిస్తోంది. కానీ ఇలా చేయడం ద్వారా నాకు డబ్బు వస్తుంది. అలాగే ఆ కంపెనీలో పాన్ ఎంతో కొంతమంది ఉద్యోగులకు పని దొరుకుతుంది. మంచి జీతం వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

విశేషమేమిటంటే బాలీవుడ్ తారలు మద్యం, పొగాకు, పాన్ మసాలా యాడ్ లలో తరచుగా నటిస్తారు. పాన్ మసాలా యాడ్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ కూడా కన్పిస్తారు. ఈ ప్రకటనలపై నిరసన వ్యక్తమవుతున్నప్పుడు ఈ తారలు మౌనంగా ఉంటారు. ఒకసారి ప్రియాంక చోప్రా తనకు ఏదైనా ప్రచారం చేయాల్సి వస్తే అది చేస్తానని చెప్పింది. ప్రజలు ఈ ఉత్పత్తిని కొనకూడదనుకుంటే కొనకండి అంటూ ఘాటుగా బదులిచ్చింది. అది కూడా నిజమే కదా ! వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేసినంత మాత్రాన కొనాలని లేదుగా !మరింత సమాచారం తెలుసుకోండి: