అక్కినేని అఖిల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన లక్కీ గాయ్. సినీ బ్యాగ్రౌండ్ టన్నుల కొద్దీ ఉన్న కథానాయకుడు. గ్రీకు వీరుడికి పుట్టిన అమ్మాయిల కలల రాకుమారుడు. అందానికి అందం, నటనలో వారసత్వం పుంజుకుని సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత న్యూయార్క్ లోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత 2014 లో మనం సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేశాడు. అనంతరం వి వి వినాయక్ డైరెక్షన్ లో "అఖిల్" సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు అఖిల్. ఈ సినిమాకి హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలా 2015 లో హీరో గా అఖిల్ తన జర్నీ మొదలుపెట్టి ఐదుఏళ్ళకు పైనే గడుస్తోంది.

ఇప్పటికి తన కెరీర్ లో వరుస చిత్రాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మొదటి సినిమానే ఫ్లాప్ కావడం, ఇప్పటికీ మూడు సినిమాలు చేసినా ఒక్కటి కూడా టార్గెట్ రీచ్ కాకపోవడంతో నాగ్ రంగం లోకి దిగి తనయుడి కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టారట. ఇపుడు అఖిల్  కెరియర్ ని మలుపు తిప్పే సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఎంతటి వారైనా కొన్ని సార్లు కథ ఎంపిక, లుక్ వంటి చిన్న చిన్న పొరపాట్ల వలన ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనసు పెట్టి, ఇంకో వైపు కాలం కలసివస్తే హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఎంతటి హీరో అయినా సక్సెస్ అందుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాల్సిందే అంటున్నారు కొందరు సినీ సీనియర్ విశ్లేషకులు.

సినిమా సక్సెస్ కి కథ చాలా కీలకం, కథను ఎంచుకునే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఆ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించ గలదా లేదా అని ఆలోచించాలి. ముఖ్యంగా సామాన్యునికి దగ్గరగా కథ ఎంపిక ఎంతో కీలకం. ఆ కథనం తనకు ఎంత వరకు సూటవుతుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు మార్పులు ఉండాలి.  డాన్స్ లో స్టైల్, నటనలో కొత్తదనం ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి అడుగు వేసి ప్రేక్షకుల మెప్పును పొందగలిగితే సక్సెస్ అందుకోవచ్చు అంటున్నారు. మైరి ముందు వచ్చే సినిమాల్లో అయినా అఖిల్ హిట్ రుచి చూస్తాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: