యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్య కు జంటగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల చాలా సార్లు విడుదల తేది ప్రకటించి కూడా విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో నాగ చైతన్య ప్రమోషన్ లో భాగంగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

 ఈ ఇంటర్వ్యూ లో భాగంగా నాగ చైతన్య 'లవ్ స్టోరీ' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. నాగ చైతన్య 'లవ్ స్టోరీ' సినిమా గురించి తెలియజేస్తూ.. ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. సాధారణంగా అనిపించిన యస పలికే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. మాట్లాడిన సమయంలో యస లా అనిపించిన తర్వాత వింటే మాత్రం యస అనిపించేది కాదు. అందుకే డబ్బింగ్ సమయంలో కాస్త ఎక్కువ కష్టం అయిందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలో కూడా తెలంగాణ యాస మాట్లాడేందుకు చాలా ప్రయత్నించాను అంటూ తెలియజేశాడు. శేఖర్ కమ్ముల గారి సినిమా షూటింగ్ అంటే ప్రతి రోజు ఫిల్మ్ స్కూల్ కు వెళ్ళినట్టు గానే ఉండేది.  ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. శేఖర్ కమ్ముల ఫిలిం మేకింగ్ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు. శేఖర్ కమ్ముల చిత్రీకరించే ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అని నాగ చైతన్య తెలియజేశాడు. నాగ చైతన్యసినిమా తో పాటు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో 'థాంక్యూ' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: