సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేయాలి. లేకపోతే అతి తక్కువ కాలంలోనే వారి కెరియర్ ఎండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా ఎంపిక లో లోపాల వల్ల ఎంతో మంది హీరోలు ఇప్పటి వరకు తమ కెరీర్ ను అర్థాంతరంగా ముగిసేలా చేసుకోగా ఇప్పుడు కొంతమంది హీరోల కెరీర్ లి ప్రమాదంలో పడుతున్నాయి.  కథ ల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా వీరు తమ సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్త కూడా వహించడం లేదు.

అలాంటి హీరోలు టాలీవుడ్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తూ మీడియం రేంజ్ హీరో గా నిలదొక్కు కోలేకపోయాడు సందీప్ కిషన్. ఇటీవలే వచ్చిన గల్లీ రౌడీ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోగా ఆయనకు మరొక భారీ ఫ్లాప్ తన ఖాతాలో చేరిందని చెప్పొచ్చు. అంతేకాకుండా హీరో నాగ శౌర్య నారా రోహిత్ అక్కినేని అఖిల్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. నాగ శౌర్య ప్రస్తుతం చేస్తున్న లక్ష్య సినిమా హిట్ కొట్టకపోతే ఆయన కెరీర్లో ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఇక అక్కినేని అఖిల్ మోస్ట్ వాంటెడ్ బ్యాచ్లర్ సినిమాతో ఎలాగైనా హిట్ సాధించి తీరాల్సిందే. నారా రోహిత్ కెరీర్ దాదాపు అయిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు ఆయన చేతి లో ఒక్క చిత్రం కూడా లేదు.

ఇంకా మరికొంత మంది హీరోలు కూడా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు.  బెల్లంకొండ శ్రీనివాస్ ఈ లిస్ట్ లో ముందు ఉన్నాడు. ఆయన టాలీవుడ్ లోనే సెటిల్ కాలేదు కానీ బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేసి అక్కడ నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ హీరోలు తొందరగా మేల్కొని తమ సినిమాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ హిట్ కొడతారా లేదా మూస కథలను రొటీన్ కథలను చేసి తమ కెరీర్ ను తొందరలోనే ముగించుకుంటారా ఉంటారా అనేది చూడాలి. ఏదేమైనా హీరోగా పరిచయం అవ్వడం కంటే హీరోగా నిలబడడమే కత్తి మీద సాము లాంటిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: