దర్శక ధీరుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్నటువంటి చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుందని సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్రబృందం మరొక తేదీన ప్రకటించనునట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని సమాచారం. ఇందులో కొమురంభీం పాత్రలో నటిస్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా పులితో పోటీపడినట్లు సమాచారం. అయితే ఇది ఏ గ్రాఫిక్స్ పులో అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే.
 
ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజమైన పులితో తల పడినట్లు వార్త వినిపిస్తుంది.ఈ సన్నివేశానికి సహజత్వం రావాలంటే తప్పనిసరిగా పులితో పోటీ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సన్నివేశంలో పులితో పోటీపడటం కోసం ఎన్టీఆర్ నిపుణుల పర్యవేక్షణలో పులితో శిక్షణ తీసుకున్నాడని సమాచారం.ఈ విధంగా ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో నిజమైన పులితో పోటీ పడ్డారనే సమాచారం సోషల్ మీడియాలో తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటి రిస్క్లు ఇంకెప్పుడు చేయవద్దన్న అంటున్నారని సమాచారం.రాజమౌళి తెరకెక్కిస్తున్న టువంటి ఈ సినిమాలో ఇద్దరు యోధులను ఒకే తెరపై చూడటం కోసం మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: