నాని గత కొన్ని సినిమాలుగా వరస ఫ్లాప్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల విమర్శలకు గురి అవుతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు చేస్తున్న కూడా చేదు ఫలితాలు ఇవ్వడంతో నాని ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఓ టీ టీ లో విడుదల కాగా ఆ చిత్రం దారుణమైన పరాజయాన్ని మిగల్చడం తో పాటు ఎన్నో విమర్శల పాలయ్యింది. ముఖ్యంగా దర్శకుడు శివ నిర్వాణ పై విపరీతంగా విమర్శలు చేశారు. దీనికి తోడు ఇలాంటి సినిమా కోసం నాని బయట నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తో అనరాని మాటలు పడ్డాడు.

ఇంత బ్యాడ్ లక్ లో కూడా నానికి సంతోషం ఏమిటంటే ఈ సినిమాకు నష్టం లేదు 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతకు మంచి లాభం చేకూర్చింది పేమెంట్ ఇచ్చి మరీ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా నాని ఈ ఒకటే మరింత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసుకుంటుంది. 

ఇకపోతే నాని నటిస్తున్న మరొక సినిమా అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా జంధ్యాల స్టైల్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులు ముఖ్యంగా నాని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాని తిరిగి కం బ్యాక్ రావాలంటే ఈ రెండు చిత్రాలు తప్పకుండా కమర్షియల్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో పాటు ఒక కొత్త సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కూడా దసరా అనే టైటిల్ ను నిర్ణయించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: