గణపతి నవరాత్రులు అంటే చాలు వీధులు అన్ని గణేష్ మండపాల తో నిండిపోతాయి.ఇంకా మంటపాల్లో పూజలు, అలంకరణ, ప్రసాదాలు, పాటలు..ఆ సందడే వేరు.ఒకపుడు అయితే వివిధ భాషల్లో గణపతి ని స్మరించుకుంటూ పాటలు పెట్టేవారు. గణపతి నవరాత్రులు అన్ని చక్కగా భక్తి పరంగా అయేది.ఇప్పుడు అయితే ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ట్రెండీ ట్రెండీ పాటలు పెడుతున్నారు ఇప్పుడు.
 
బుల్లెట్ బండి:
ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పాట.చిన్నపిల్లల్లా దగ్గరనుంచి పెద్ద పెద్దవాళ్ల దగ్గర కూడా ఇదే వినిపిస్తుంది .

భీంలా నాయక్:
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి  ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు, ఇంకా అయిన  పాటకి ఉండే క్రేజ్ అయితే ఇప్పుడు గణపతి వరకు తీసుకెళ్తున్నారు ఫాన్స్.

దాక్కో దాక్కో మేక:
వినడానికి పాట చాలా బాగుంటుంది కానీ దేవుని మండపాల్లో పెట్టొచ్చు అంటారా?

పాగల్ టైటిల్ సాంగ్ :
గూగుల్ గూగుల్ గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగుల్, పాగల్  పాగల్ ప్రేమ కోసం వెతికే పాగల్ అంటూ గణపతి మండపాల్లో ఈ పాట మారుమోగిపోతుంది.

మానికే మాంగే:
ఈ పాటకు   ప్రపంచవ్యాప్తంగా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, భక్తి సాంగ్స్ ప్లేసులో దీన్ని రీ ప్లేస్ చేసేసారు.

పరం సుందరి:
ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఎక్కడ చూసిన చాలా మంది,ఈ పాటకి డాన్స్ చేసి పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. అయితే భక్తుల కి ఎం అనిపిస్తుందో కానీ ఈ పాటను కూడా తెగ పెట్టేస్తున్నారు విఘ్నేశ్వరుని దగ్గర.

సారంగ దరియా:
ఇంకా ఈ పాట అయితే రిపీట్ మోడ్ లో ప్లే అవుతుంది చాలా మండపాల్లో.

ఏంటో ఎక్కడ ఎం పాటలు పేట లో తెలియట్లేదు అనుకోవాలా లేక తెలిసి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు  అనుకోవాలా?
పాటలు పెడుతుంది దేవుని మీద భక్తి తో నా  లేక వేళకి ఎంటర్టైన్మెంట్ కోసమా....

ఇవి మేము చూసినవి,విన్నవి,... మరి మీరు ఇవి కాకుండా ఇంకేవైనా పాటలు విన్నారా సుమ..?

మరింత సమాచారం తెలుసుకోండి: