పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మూవీ విడుదల అవుతోంది అంటే కేవలం మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాక మాములు ఆడియన్స్ లో కూడా దానిపై మంచి ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్, ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ మూవీ పరిశ్రమకి హీరోగా రీఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ లో పవన్ కళ్యాణ్, సత్యదేవ్ అనే పాత్ర చేయగా ఆయనకీ జోడీగా శృతి హాసన్ నటించారు. దాని తరువాత ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ అనే మూవీ చేస్తున్నారు పవర్ స్టార్.
రానా కూడా ఒక కీలక రోల్ చేస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. అలానే మరొక సినిమా హరిహర వీమల్లు కూడా చేస్తున్నారు పవన్. క్రిష్ తీస్తున్న ఈ పీరియాడికల్ ఎంటర్టైనర్ ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అలానే వీటి తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ తో పాటు సురేందర్ రెడ్డి తో ఒక మూవీ కూడా చేయన్నారు పవర్ స్టార్. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల కెజిఎఫ్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడి ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్ చేస్తున్నారు.

దాని తరువాత మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఒక మూవీ వర్క్ చేయనున్న ప్రశాంత్ నీల్, పవర్ స్టార్ తో కనుక ఒక సినిమా చేస్తే ఆ మూవీ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అని పలువురు ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కి అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉందని, అటువంటి మా హీరోతో ప్రశాంత్ నీల్ వంటి భారీ మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు రాబోయ్ రోజుల్లో ఒక్క సినిమా అయినా చేయాలని తాము కోరుకుంటున్నట్లు పలువురు పవన్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు .మరి పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్న విధంగా ఆయన తో ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: