యంగ్ హీరోలు హిట్ కోసం ఆరాటపడుతున్నారు. ఫ్లాపుల నుంచి బయటపడి హిట్ ట్రాక్ ఎక్కాలని నానాప్రయత్నాలు చేస్తున్నారు. బాడీలు పెంచుతున్నారు కానీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య. సరికొత్త కథలతో.. వెండితెరను మెరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు యంగ్ హీరోలు.

అఖిల్ 'మనం' సినిమాలో కామియో రోల్‌ చేసినప్పుడు అక్కినేని అభిమానులు సిసింద్రీ టాప్‌స్టార్ అవుతాడని ఊహించుకున్నారు. మాస్ హీరోగా ఎదుగుతాడని అనుకున్నారు. కానీ అఖిల్‌ ఇప్పటివరకు వాళ్ల అంచనాలని అందుకోలేకపోయాడు. మాస్, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ రెండిటిలోనూ అఖిల్‌కి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఈ హీరో 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌'తో పాటు 'ఏజెంట్' సినిమాలు చేస్తున్నాడు. అల్లు శిరీష్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద బ్యానర్‌ ఉంది. గీత ఆర్ట్స్‌లో సినిమాలు చేసుకునే అవకాశముంది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో బడా నిర్మాత ఉన్నా, ఈ హీరోకి ఇప్పవరకు సరైన హిట్‌ మాత్రం రాలేదు. 'పుష్ప' ఇంట్రడక్షన్‌లో ఈవెంట్‌లో శిరీష్ ఇంకా కష్టపడతానని స్పీచ్‌ ఇచ్చినప్పుడు కూడా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇలాగైతే కష్టమనే కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పుడీ హీరో 'ప్రేమ కాదంట' అనే సినిమా చేస్తున్నాడు.

కార్తికేయకి 'ఆర్.ఎక్స్.100'తో సూపర్‌ క్రేజ్ వచ్చింది. యూత్‌లోనూ మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మూవీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డాయి. 'హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్. చావు కబురు చల్లగా' ఫ్లాపులతో కార్తికేయ గ్రాఫ్ కూడా డౌన్ అయ్యింది. ఇలాంటి టైమ్‌లో 'రాజా విక్రమార్క' మూవీతో వస్తున్నాడు కార్తికేయ. సాయి కుమార్ వారసుడు ఆది హిట్‌ కొట్టి చాలాకాలమైంది. కెరీర్‌ బిగినింగ్‌లో వచ్చిన 'ప్రేమకావాలి, లవ్‌లీ' తర్వాత ఆది మళ్లీ ఆ స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. దీంతో ఈ హీరోకి ఇప్పటివరకు సొంత మార్కెట్‌ కూడా క్రియేట్‌ కాలేదు. ఆడియన్స్‌తో కూడా గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్‌ని ఫిల్‌ చెయ్యడానికి ఆది 'జంగిల్, కిరాతక, అమరన్, బ్లాక్‌' లాంటి సినిమాలు చేస్తున్నాడు.  

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాస్ హీరోగా ఎదగాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. ఫస్ట్‌ మూవీ నుంచే టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్స్‌తో సినిమాలు చేస్తూ, మార్కెట్‌ పెంచుకోవాలనుకుంటున్నాడు.  కానీ బెల్లంకొండ ఇంకా ఆ అంచనాలకి దూరంగానే ఉన్నాడు. ఇలాంటి స్టేజ్‌లో 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అలాగే తమిళ హిట్ 'కర్ణన్‌'ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. చూద్దాం యంగ్ హీరోల ప్రయత్నాలు ఏ మాత్రం సక్సెస్ ని ఇస్తాయో.






మరింత సమాచారం తెలుసుకోండి: