టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన గళం తో ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్. చిన్న గాయకుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న సినిమాలకు మాత్రమే పాడే ఈ గాయకుడు బిగ్ బాస్ షో లోకి వెళ్లిన తర్వాత ఒక్క సారిగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెద్ద సినిమాలకు పారడం మొదలుపెట్టాడు. ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు గొప్ప గొప్ప సూపర్ హిట్ పాటలను ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ సింగర్ గా ఉన్నాడు అని చెప్పవచ్చు.

మంచి ప్రతిభ, ప్రతిభకు తగ్గ ప్రవర్తన ఉండడంతో రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుల నుంచి మంచి అవకాశాలను పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకులు ఎదగడం లేదు అన్న ప్రశ్నకు రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ ఉదాహరణ. జానపద పాటలు, ఉద్యమ పాటలను సైతం పాడగల సత్తా ఉంది ఈయ నలో.. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాట తో యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందిన రాహుల్ నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడు అనే పాటతో సినిమా రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 

1989వ సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించిన రాహుల్ లయోలా హైస్కూల్ లో ఉన్న ఉన్నత విద్యను, నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ విద్యను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టంతో ఎంతో సాధన చేసి ఇప్పుడు ఈ స్థాయి సింగర్ గా చేరుకున్నాడు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కూడా మంచి ప్రాచుర్యం పొందాడు. లేటెస్ట్ గా చావు కబురు చల్లగా ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో ఆయన సూపర్ హిట్ పాటలను పాడారు. ఇక పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ప్రేమ వ్యవహారాలు వివాదాల్లోకి తీసుకువచ్చాయి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు  పునర్నవి తో బయటికి వచ్చాక అషు రెడ్డి తో ప్రేమాయణాలు సాగాయని వార్తలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: