సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు చేసిన పని గత కొన్ని రోజుల నుంచి చర్చల్లో నిలుస్తోంది. దానికి కారణం వారు రజినీకాంత్ పోస్టర్ రక్తాభిషేకం చేయడమే. పైగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రజినీ అభిమానులపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులం అని చెప్పుకుంటూ వారు చేస్తున్న మూర్ఖపు పనులపై పలువురు మండి పడుతున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న 'అన్నాత్తే'లో కనిపించబోతున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు సిరుతై శివ 'అన్నాత్తే' మొదటి కాపీని తయారు చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమా లో రజనీకాంత్ ఒక గ్రామ పెద్దగా కనిపించనుండగా, ఖుష్బు, మీనా, నయనతార , కీర్తి సురేష్ , సతీష్, సూరి, ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే వినాయక చవితి సందర్భంగా "అన్నాత్తే" ఫస్ట్ లుక్ తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్.

అయితే కొంత మంది అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మేకను బలిచ్చారు. అంతటితో ఆగకుండా పోస్టర్ కు మేక రక్తంతో రక్తాభిషేకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో రజినీకాంత్ అఫిషియల్ అభిమానుల సంఘం ఫ్యాన్స్ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అంటూ ప్రకటించింది. తాజాగా అలా మేకను బలిచ్చిన వారిపై జంతు సంరక్షణ సంస్థ తమిళనాడులో పోలీస్ కేసు నమోదు చేసింది. అభిమానం హద్దు మీరితే ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: