యమ్ యమ్ కీరవాణి సంగీతనికే  కాకుండా ఆయన గాత్రనికి చాలామంది అభిమానులు ఉన్నారు. 30 ఏళ్ల తన సంగీత ప్రస్థానంలో ఆయన పాడిన పాటలు తక్కువే అయినప్పటికీ ఆ పాటలకి నిజంగానే ఆయన గాత్రంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా ఆయన పాడిన మాతృదేవోభవ సినిమాలోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే" అని ఆయన పాడిన పాట ఇంకో 100 సంవత్సరాలు అయిన కూడా గుర్తుంటాది. అలాగే కీరవాణి కి పాడిన బాహుబలి లోని దండలయ్య పాటని కూడా అద్భుతంగా పాడారు.

కీరవాణి గారి సంగీతానికి ఆలపించిన పాటలకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయన సంగీతం అందించిన అన్నమయ్య సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. అలాగే 11 నంది అవార్డ్స్ తో పాటు 8 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అందులో స్టూడెంట్ నెంబర్ 1 లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటకి మర్యాద రామన్న లోని తెలుగు అమ్మాయి పాటకి నంది అవార్డ్స్ లభించాయి. కీరవాణి గారు తన సినిమాల్లోని పాటలే కాకుండా వేరే సంగీత దర్శకుడి సంగీతంలో కూడా పాడారు. ఈ మద్యనే వచ్చిన 2.0 సినిమాలో బుల్లిగువ్వ అనే పాటని ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడారు.

ఇవే కాకుండా కీరవాణి గారు పాటలకు లిరిక్స్ కూడా అందిస్తారు. ఒక సమయంలో సంగీత దర్శకుడి గా సినిమాలు ఆపేస్తాను అని చెప్పిన కీరవాణి మళ్ళీ బాహుబలి తర్వాత సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలోనే వస్తున్న కొండ పొలం అనే సినిమాకి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలు అంటే కీరవాణి సంగీతం తప్పకుండా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: