అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమా ఇప్పటికే అనేక సార్లు విడుదల తేదీని ప్రకటించి ఆ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మధ్యె వినాయకచవితికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. కానీ ఆ తర్వాత సినిమా విడుదలను చిత్రం బృందం వాయిదా వేసింది. ఇలా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా  సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


ఈ సినిమాకు అనేక  'ఓటిటి' సంస్థల నుండి ఆఫర్లు వచ్చినా కూడా చిత్రబృందం మాత్రం ఈ సినిమాను థియేటర్లలో చూస్తే వచ్చే ఫీలింగ్ 'ఓటిటి' ల ద్వారా రాదు అనే ఉద్దేశంతో ఎన్ని మంచి ఆఫర్లు వచ్చినా వాటిని వదులుకుని థియేటర్లలో విడుదల చేయాలని ఉద్దేశం తో  థియేటర్ లోకి తీసుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, టీజర్లు, పోస్టర్లు,  ట్రైలర్ లకు జనాలను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో అని చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏపీలో ఇప్పటికి కూడా 50% ఆక్యుపెన్సీ తో థియేటర్లను రన్ చేస్తున్నారు. మరియు టికెట్ రేట్ల విషయంలో కూడా ఇప్పటికీ ఏ విషయం కొలిక్కి రాలేదు. ఈనెల 20వ తేదీన సిని పెద్దలతో ప్రభుత్వం భేటీ తర్వాత టికెట్ రేట్ల పెంపుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోమని అనుమతిస్తే పెరిగిన ధరలతో  'లవ్ స్టోరీ'  సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇటు తెలంగాణలో మాత్రం ప్రభుత్వాలు 100% ఆక్యుపెన్సీ కి పర్మిషన్ లు ఇచ్చాయి.


మరియు టికెట్ రేట్ల విషయంలో కూడా పెంపుదలకు అవకాశాన్ని కల్పించాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సింగల్ స్క్రీన్ కు 150 మల్టీప్లెక్స్ లకు రెండు వందల వరకు ధర పెరిగింది. ఇలా తెలంగాణలో పెరిగిన రేట్ల కారణంగా మరియు తెలంగాణలో శేఖర్ కమ్ముల సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉండడంతో సినిమా తెలంగాణ లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా భయాన్ని పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో జనాలలు థియేటర్ల కు వస్తారా అనేది ఒక పెద్ద సమస్యగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: