స్టార్ హిరోయిన్ లు అంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. వారికి త‌గిన క‌థ వింటే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే వ‌చ్చాయి. అందులో దాదాపు అన్ని కూడా హిట్ ను అందుకున్నాయి. టాలివుడ్ స్టార్ హిరోయిన్ స‌మంత కూడా లేడీ ఓరియెంటెడ్ వైపే ఆస‌క్తి చూపుతుంది. ముఖ్యం స‌మంత పెళ్లి త‌ర్వాత నుంచి కేవ‌లం లేడా ఓరియెంటెడ్ సినిమా ల‌పైనే దృష్టి సారించింది. ఈ అక్కినేని కోడ‌లు ఇప్ప‌టికే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. స‌మంత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అన్నికూడా హిట్ కావడంతో మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.


ఇప్ప‌టికే స‌మంత గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. అది శాకుంత‌లం అనే టైటిల్ త్వ‌ర‌లో ముందుకు రానుంది. ఈ సినిమాలో స‌మంత టైటిల్ రోల్ ను చేస్తుంది. శాకుంత‌లం సినిమా షుటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పొస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులల్లో బిజి గా ఉంది. ఇది ఇలా ఉండ‌గా తాజా ఈ అక్కినేని కొడ‌లు మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమా కు ఓకే చెప్పింద‌నే టాక్ విన‌బ‌డుతుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అధినేత శివ‌లంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కాగ దీనికి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస‌త్తారో తెలియాల్సి ఉంది. కాగ శివ‌లంక కృష్ణ  ప్ర‌సాద్ గ‌తంలో ఆదిత్య 369, వంశానికొక్క‌డు, జెంటిల్ మెన్‌, స‌మ్మోహ‌నం వంటి హిట్ సినిమాల‌ను నిర్మించారు.



ఇది ఇలా ఉండ‌గా టాలివుడ్ లో స్టార్  హిరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఆస‌క్తి చూపుతున్నారు. ముందుగా హిరోయిన్‌ అనుష్క ఈ లేడీ ఓరిమ‌యెంటెడ్ సినిమా లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆమె మొద‌టి సినిమా అరుంధ‌తి హిట్ కావ‌డంతో అనుష్క వ‌ర‌స పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసింది. అప్ప‌టి నుంచి అనుష్క ను ప‌లువురు స్టార్ హిరోయిన్లు ఫాలో అవుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు. కాగ స‌మంత ఇప్ప‌టికే రాజుగారిగ‌ది 3, .జాను, ఓ బేబి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి హిట్ అందుకుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: