టాలీవుడ్ హీరో నితిన్ గత కొన్ని సినిమాలుగా వరుస పరాజయాలు అందుకోవడంతో ఆయన అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఒక్కసారిగా ఇలా ఫ్లాప్ లు మూటకట్టుకోవడం ప్రతి ఒక్కరిని నిరాశ పరచగా ఇప్పుడు ఆయన చేస్తున్న మ్యాస్ట్రో చిత్రం ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే మాస్ట్రో చిత్రం ప్రముఖ ఓ టీ టీ సంస్థ హాట్ స్టార్ లో విడుదల కాగా విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచిన సినిమా గా మిగిలింది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాభ నటేష్ హీరోయిన్ గా తమన్నా ప్రతినాయక గా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధదున్ సినిమాకి రీమేక్ కా అందరిలో ఈ చిత్రం పై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఫ్లాప్ లు ఉన్న సమయంలో ఈ విధంగా రీమేక్ సినిమాలు చేయడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. అయినా కూడా సినిమాపై ఉన్న నమ్మకంతో ఆయన ఈ సినిమాను ఎంతో శ్రద్ధ గా చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడు.

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కానీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలియ లేదు. అంధుడిగా తనదైన ట్రేడ్ మార్క్ తో నటిస్తూ సినిమా ను సూపర్ హిట్ చేశాడు. ఈ సినిమాలో విలన్ గా నటించిన తమన్నా విలన్ పాత్రలో అదరగొట్టేసింది అని చెప్పాలి. ఇక నాభ అందాలు ఈ చిత్ర విజయానికి బాగానే తోడయ్యాయి. ముఖ్యంగా మేర్లపాక గాంధీ అడిషనల్ స్క్రీన్ ప్లే  ఆకట్టుకోగా దర్శకుడిగా ఆయన ఇప్పటికే తనను తాను తన దర్శకత్వ ప్రతిభ తో ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఈ సినిమాలో ఆయన యాడ్ చేసిన కొన్ని సీన్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: