మాస్ట్రో చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాలో బలా బలాలు బలహీనతలు ఏంటి అనే కోణంలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. అయితే వారికి బలహీనతలు బలాలు అనేది పక్కన పెడితే ఈ చిత్రంలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం ఎంతగానో నచ్చాయి అని తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నితిన్ గుడ్డివాడు గా చిత్రం మొత్తం ఉంటాడు అనే ఆలోచనలో ప్రేక్షకులు ఉండగా ఒక్కసారిగా ఆయన గుడ్డి వాడు కాదని గుడ్డివాడిగా నటిస్తున్నాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ చిత్రంలో మొదట్లోనే వచ్చే ఈ ట్విస్ట్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం తో పాటు ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ సినిమాలో వచ్చే మరో ట్విస్ట్ నితిన్ అంధుడిగా మారడం. ఒకానొక కాన్ స్పిరసి లో తమన్నా ని నితిన్ ను కావాలనే గుడ్డివాడి గా మారుస్తుంది. ఇది కూడా ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. ఫోకస్ స్టడీగా ఉండాలని చెప్పి నితిన్ గుడ్డివాడిగా నటించడం సినిమా మొదటి నుంచి మొదలు పెడతాడు. అలాంటిది ఆయన సడన్ గా గుడ్డివాడి గా మారడం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంది.

ఇక ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏమిటంటే తమన్నా అక్రమ సంబంధం ఆమె భర్త ను చంపపడుతుంది. గుడ్డివాడు అనుకున్న నితిన్ అక్కడ ఉన్న సమయంలోనే ఈ హత్య జరుగుతుంది. తమన్నా అతను గుడ్డివాడు అనుకొని శవాన్ని మాయం చేయడం వంటివి అన్నీ చేస్తూ ఉంటుంది. అయితే అతను గుడ్డి వాడు కాదని పసిగట్టిన తమన్నా అతన్ని మళ్లీ అందుడిగా మార్చడం అనే ప్రక్రియ సినిమాకే హైలెట్. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా తమన్నా యాక్సిడెంట్ అవ్వడం కూడా ఎవరూ ఊహించనిదే అని చెప్పాలి. తమన్నా భర్తగా నరేష్ నటించగా నాభా నటేష్ అందాలు ఈ సినిమాకు బాగానే ప్లస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: