సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో తరుణ్. తన మొదటి చిత్రం"నువ్వే కావాలి"తోనే ఎంతో ఘన విజయాన్ని సాధించాడు తరుణ్. ఈ సినిమా ద్వారానే హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత తరుణ్ నటించిన నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ఇలా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి.


ఇలా వరుస పెట్టి సినిమాల సక్సెస్ తో ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా గుర్తింపు చేసుకుంటున్న సమయంలో తరుణ్ ను వరుస ప్లాపులు వెంటాడాయి. ఇది తన కెరీర్ కి ఒక మైనస్ గా మిగిలిపోయింది. తరుణ్ నటించిన సోగ్గాడు, భలే దొంగలు.. ఇలా వరుస పెట్టి సినిమాలు చేసిన అవి ఆశించి ఫలితం ఇవ్వకుండా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టాయి.

ఇక తరుణ్ చివరిగా నటించిన చిత్రం ఇది నా లవ్ స్టోరీ. ఈ చిత్రం దాదాపు కొన్ని సంవత్సరాల క్రిందట విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక ఆ తర్వాత తరుణ్ సినిమాల వైపు అడుగులు వేయలేదు. కానీ తరుణ్ అభిమానులు మాత్రం తనకి పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నారు.తను చేసిన తప్పు ఏమిటంటే సినిమా కథల ఎంపికలో సరిగ్గా చేయకపోవడమేనట.

అలా సినిమా కథల ఎంపికలో తను సరిగ్గా ఉండి ఉంటే ఇప్పటి వరకు తను కూడా ఒక స్టార్ హీరోగా ఎదిగే వాడని తన అభిమానులు అనుకుంటున్నారు. మరొకవైపు డ్రగ్స్ కేసులో కూడా ఈ నెల 22న..  ఈ హీరోని విచారణకు హాజరు కావలసిందిగా.. ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తరుణ్ రీఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయంపై మరి కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా.. సక్సెస్ తక్కువగా ఉన్న హీరో ఈయనే అని చెప్పుకోవచ్చు. తరుణ్ రీఎంట్రీ ఇస్తానంటే దర్శకనిర్మాతలు ఆయనకి కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: