శంకర్ మహదేవన్ గారి పేరుకి పరిచయం అక్కర్లేదు. ఆయన గాత్రంలో ఉండే తియ్యేదనం అంత ఇంత కాదు. ఆకాశం అమ్మాయితే లాంటి రొమాంటిక్ పాట అయిన ,మంజునాధ లో మహాప్రణ గీతం అనే భక్తిరస పాట అయిన , కొడితే కొట్టాలిరా అని మాస్ సాంగ్ అయిన ఆయన గాత్రంతో కొత్త అందం తీసుకొస్తాడు. 1998 లో మహదేవన్ గారు నిర్మించి పాడిన బ్రేఆత్ లెస్ ఆల్బమ్ ఆయనకి పెద్ద పెరు తెచ్చింది. ఆ తర్వాత ఆయన వరసగా సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడం అలాగే పాటలు పాడటం చేయడం మొదలుపెట్టారు.

ఆయన అప్పుడు పాడిన బ్రేఆత్ లెస్ సాంగ్ ఇప్పటికి చాలా ఫేమస్. ఇక తెలుగులో ఆయన పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వొస్తాను అంటే నేనొద్దంటానా లో చంద్రుళ్ళో ఉండే కుందేలు పాట , అత్తారింటికి దారేది లో అమ్మో బాపుగారి బొమ్మో పాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన హింది వారు అయినప్పటికీ తెలుగు ఆయన ఎంతో కష్టమైన పదాలను చాలా అలవోకగా పాడతాడు.  శంకర్ మహదేవన్ గారికి ఇప్పటిదాకా 3 నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం. అలాగే 2019 లో ఆయన సంగీతానికి చేసినా సేవ కి శంకర్ మహదేవన్ గారిని  పద్మ శ్రీ తో ప్రభుత్వం సత్కరించారు.

 ఇక హిందీలో ఆయన సంగీతం అందించిన పాటలు అన్ని సూపర్ హిట్స్ అనే చెప్పాలి.ఇక తెలుగులో శంకర్ మహదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా సిద్దార్ధ నటించిన  కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి.శంకర్ మహదేవన్ గారి హిందీలో స రి గమ ప అనే సింగింగ్ రియాలిటీ షో కి జడ్జ్ గా కూడా చేసారు. ఆ తర్వాత జడ్జ్ గా ఆయన చేసిన సూపర్ సింగర్ ఇండియాలోనే చాలా పేరున్న షో.

మరింత సమాచారం తెలుసుకోండి: