గత ఏడాది కరోన వచ్చి అందరి జీవితాలు కుదిపేసిన సమయంలో ప్రముఖ సినీ నటుడు సోను సూద్ మొదట తన చుట్టూ ఉన్నవాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లగా ఆ స్టేట్ అంత వ్యాపించింది. ఏడాది గడిచేలోపు సోను సూద్ అనే పేరు ఒక బ్రాండ్ గా మారింది. ఆయన పేరుతో సోను సూద్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టి దేశంలో ఉండే ప్రజలందరికీ సహాయం చేయడమే మొదలుపెట్టారు సోను సూద్.అయితే ఇలా అందరికి సహాయం చేయండం ఆయాన మీద ఎక్కడ లేని స్పాట్ లైట్ ని తెచ్చింది.

ఇక ఈ మద్యనే ఇంకామ్ టాక్స్ ఆఫీసర్స్ సోను సూద్ ఆస్తులు అన్ని సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈరోజు ఇంకామ్ టాక్స్ అధికారులు నమ్మలేని విషయాన్ని ఒకటి బయటపెట్టారు. అదేంటి అంటే సోను సూద్ ఫౌండేషన్ విరరాలుగా దాదాపుగా 18 కోట్లు సేకరించారట. కానీ ఫౌండేషన్ మాత్రం అందులో కేవలం 1.8 కోట్లుతో మాత్రమే  సహాయం చేసారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ విషయం మీద సోను సూద్ ఫాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు.

మంచి పని చేసేవాల్లకి ఇలాంటి ఇందలు తప్పవు అని సోషల్ మీడియా లో కామెంట్ చేయగా కొంతమంది మాత్రం ఇలాంటివి ఇంకెన్ని వస్తాయో సోను సూద్ నుంచి అని ఎదురుచూస్తున్నారు.  ఇక ఈ విషయం మీద సోను సూద్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఇది ఒకవేళ నిజం అయితే ఆయనని నమ్మిన వాళ్ళ ఇంకెప్పుడు మళ్ళీ నమ్మరు. అలాగే ఇలా ఫ్రాడ్ చేస్తే ఆ కేస్ ఎంత దూరం పోతుందో అందరికి  తెలిసిందే. ఇక దీని మీద సోను సూద్ వచ్చి స్పందింస్తే తప్ప ఈ వైరల్ న్యూస్ కి చెక్ పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: