ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఓ టీ టీ సంస్థలకు క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్లకు మించిన క్రేజ్ ఈ ఓ టీ టీ సంస్థలకు ఉంది అని ఆయా సంస్థలకు వస్తున్న వ్యూస్ ను బట్టి చెప్పవచ్చు.  ఇది ఇప్పటి ట్రెండ్. మరోవైపు మేకర్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఇష్టం చూపిస్తున్నారు.

కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ భాషలో మాత్రమే ఓటీటీ సంస్థలు ప్రసారం కాగా తాజాగా ప్రాంతీయ భాషల్లోకి కూడా ఈ ఓ టీ టీ సంస్థలు అడుగుపెడుతూ లోకల్ గా మంచి పాపులారిటీని దక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే డిస్నీ హాట్ స్టార్ తెలుగు లో ఎప్పటినుంచో వివిధ రకాల సినిమాలతో షోలతో అలరిస్తుంది. కాగా ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ఈ హాట్ స్టార్ తెలుగు సినిమాలలో టాప్ హీరోగా ఉన్న రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. మన వినోద విశ్వం అనే ట్యాగ్ లైన్ తో రామ్ చరణ్  ఈ ఓ టీ టీ ని ప్రమోట్ చేయనున్నారు. 

ఇకపోతే రాబోయే కాలంలో ప్రేక్షకులను అలరించడానికి అన్ని ప్రణాళికలను వేసింది ఈ డిస్నీ హాట్ స్టార్. అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగా రకరకాల సినిమాలను , ఆటలను, షో లను ను ప్రసారం చేయనుంది. ఐపీఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అలాగే జాతీయ అంతర్జాతీయ చిత్రాలను కూడా హాట్ స్టార్ లో మనం వీక్షించవచ్చు. కాగా రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ అనే ప్రకటనను ఈరోజు సాయంత్రం స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో అనౌన్స్ చేయనున్నారు. మరి తెలుగులో లో ఈ హాట్ స్టార్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: