బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈ వారం హౌస్ లో బెస్ట్ అండ్ వరెస్ట్ పెర్ఫార్మర్స్ ని ఎంచుకోమని అన్నాడు బిగ్ బాస్.ఇందులో భాగంగానే గతవారం చూసుకున్నట్లైతే జెస్సిని వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంచుకొని జైల్లో ఉంచారు.ఆనీ మాస్టర్ తో జరిగిన గొడవకు జెస్సి బలైపోయాడు.అయితే జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత జెస్సి ప్రవర్తన లో చాలా మార్పు వచ్చింది.ఇక ఈ వారం పంతం నీదా నాదా సై టాస్క్ లో కాస్త ఓవర్ గా మాట్లాడి, ఓవర్ గా ఆడినందుకు హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓట్లు సన్నీకి పడ్డాయి.

నిజానికి ఈ వారం బెస్ట్ పెర్ఫార్మర్ గా ఒకరిని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒక్కొక్కరు పేర్లు చెప్పడంమొదలు పెట్టారు.ఇక ఇందులో మెజారిటీగా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పారు.ఇకపోతే వరెస్ట్ పెర్ఫామర్ ఎవరని అడిగితే, హౌస్ లో ఎక్కువమంది సన్నీ పేరు చెప్పారు.ఈ వారం సన్నీ తో చాలా మందే గొడవ పడ్డారు.ప్రియ ,రవి, ఉమా, షణ్ముక్, కాజల్, సిరి, ప్రియలు సన్నీపేరు చెప్పారు. దీంతో సన్నీ ని జైల్లో ఉంచమని ఆదేశించాడు బిగ్ బాస్.అయితే ఏ మాత్రం బాధ పడకుండా నవ్వుతూ జైల్ కి వెళ్ళాడు సన్నీ. హౌస్ మేట్స్ అందరికి టాస్క్ లో సన్నీ ఇచ్చిన పెర్ఫామన్స్ బాలేదనే కారణంగానే అందరూ సన్నీని ఎన్నుకోవడం వల్ల సన్నీ కి ఎక్కువ మెజారిటి రావడం జరిగింది.

ఇకపోతే జైలుకి వెళ్లిన సన్నీ తో తన దగ్గరకి  వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పారు లహరి, రవి, హమీదలు.ఇక మరోవైపు ఈ వారం నామినేషన్స్ లో ఆర్జే కాజల్,ఉమాదేవి, ఆనీ, నటరాజ్,ప్రియ,ప్రియాంక సింగ్, లోబో ఉన్నారు.వీరిలో ఉమాదేవి  ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఇప్పటికే మొదటి వారానికి గానూ యూట్యూబర్ సరయు ఎలిమినేట్ అయి.. హౌస్ నుండి బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఓ లేడీ యాంకర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి అడుగు పెడుతోందని వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: