ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్ల లోని సినిమాలను కాకుండా ఓ టీ టీ సంస్థలలో విడుదలయ్యే సినిమాలు చూడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా సినిమా చూడడం అలాగే బయట కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి పోవడం వల్ల ప్రేక్షకులు ఈ విధమైన సినిమా లు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు దర్శకులు సైతం ఈ విధమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కొరటాల శివ కూడా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న కొరటాల శివ ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే చిరంజీవి ఎన్టీఆర్ సినిమా గ్యాప్ లో ఓ ఓ టీ టీ సంస్థకు ఒక ప్రాజెక్టు చేయనున్నాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడా లేదా తన శిష్యులలో ఒకరికి దర్శకత్వం అప్పగిస్తాడా అనేది చూడాలి. నిర్మాతగా కూడా ఈ సంస్థలలో ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట కొరటాల శివ. 

లాక్ డౌన్ కారణంగా ఓ టీ టీ బిజినెస్ ఊపందుకుంది.  చిన్న సినిమాలు చాలా వరకు ఓ టీ టీ లోనే వచ్చేస్తున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఇందులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ డైరెక్టర్ కొన్ని కథలు సిద్ధం చేశారట. వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి గ్రూప్ ను క్రియేట్ చేసి వాళ్ల ద్వారా ఓ టీ టీ సంస్థల కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. చూడబోతే స్వయంగా పెట్టుబడులు పెట్టి సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: