తెలుగు బిగ్ బాస్ సీజన్5 రెండో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే.అయితే రెండో వారం నామినేషన్ లో  ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే అంశం సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. అయితే రెండో వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వారం కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు.అయితే తాజా సమాచారం ప్రకారం కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉమాదేవి తో పాటూ..

 లోబో,ఆర్జే కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్,ఆనీ మాస్టర్ ఉన్నారు.ఇక హౌస్ లో గేమ్ మారే కొద్ది కంటెస్టెంట్లకు వచ్చే ఓట్లలో కూడా మార్పు వస్తోంది.ఇక సోషల్ మీడియాలో పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ అయిన ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ లలో ఒకరు రెండో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చి ఉమాదేవిని పంపించినా ఆశ్చర్య పోనక్కర్లేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే హౌస్ లో ఉమాదేవి ఆవేశమే ఆమెకి పెద్ద మైనస్ గా మారుతుందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడుతున్నారు.

అయితే ఆవేశం ఎక్కువ ఉన్నా కూడా ప్రేక్షకులకు ఉమాదేవి వినోదాన్ని పంచుతున్నారని ఆమె అభిమానులు కామెంట్స్ చేయడం గమనార్హం.ఇక గత సీజన్లతో పోల్చుకుంటే సీజన్ 5 మాత్రం చాలా భిన్నంగా ఉందని..ఈ సీజన్లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.కొన్నిసార్లు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల ఆగడాలు శృతిమించుతున్నాయని..అంతేకాకుండా ఒక్కోసారి అవి హింసాత్మకంగా మారుతున్నాయని ప్రేక్షకుల నుండి విమర్శలు వస్తున్నాయి.మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: