టాలీవుడ్ కి మూడు అద్భుతమైన సీజన్లు ఉన్నాయి. అవి సంక్రాంతితో మొదలుపెడితే దసరా దాకా సాగుతాయి. ఈ మూడూ కూడా ప్రత్యేకమైన సీజన్లలో వస్తాయి. దాంతో ఈ టైమ్ లో రిలీజ్ అయ్యే మూవీస్ సూపర్ హిట్ అవడం ఖాయమని అంటారు.

అదే విధంగా ఇండస్ట్రీకి లాభాలు తెచ్చి పెట్టే గొప్ప సీజన్లుగా వీటిని చెబుతారు. టాలీవుడ్ ఏడాది గ్రాసం అంతా ఈ సీజన్ల నుంచే వస్తుంది. ఇక సమ్మర్ రెండు నెలల పాటు ఉంటే సంక్రాంతికి, దసరాకు పదేసి రోజుల వంతున సెలవులు ఉంటాయి. దాంతో ఏవరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాగే కలెక్షన్లు కూడా కొత్త రికార్డులు సాధిస్తాయి.

కానీ గత రెండేళ్ళుగా ఈ సీజన్లు పూర్తిగా డల్ అయిపోయాయి. ఈసారి సంక్రాంతి కొంత మార్కెట్ బాగుంది అనిపించినా సమ్మార్, దసరా రెండూ కూడా రెండేళ్ళుగా దెబ్బ కొట్టేశాయి. ఇక ఈసారి దసరా తీసుకున్నా ఏమంతా ఆశాజనకంగా లేదని అంటున్నారు. ఈసారి దసరాకు పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కి నోచుకోవడంలేదు. మెగాస్టార్ ఆచార్య మూవీ కానీ బాలయ్య అఖండ మూవీ కానీ రావడంలేదు. ఇక చిన్న సినిమాలే వస్తున్నాయి. అందులో అక్కినేని అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ ఒకటైతే మెగా మేనల్లుడు మూవీ కొండ పొలం కూడా వస్తోంది. ఇక శర్వానంద్ మహాసముద్రం కూడా దసరా వేళ తలపడుతోంది.

ఈ మూడింటితో పాటుగా ఒకటో రెండో చిన్న సినిమాలు వచ్చినా రావచ్చు అంటున్నారు. అయితే ఏపీలో టికెట్ల వివాదం సెటిల్ కాకపోవడం, రోజుకు మూడు ఆటలు, ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవన్నీ కలసి పెద్ద సినిమాల రిలీజ్ కి అడ్డంకిగా మారాయని అంటున్నారు. దాంతో విడుదల అవుతున్న చిన్న సినిమాలు హిట్ అయినా కూడా మార్కెట్ డల్ గానే ఈసారి ఉంటుంది అంటున్నారు. దసరా మార్కెట్ పొటెన్షియాలిటీ రెండు వందల కోట్లకు పైబడి ఉంటుంది. కానీ సారి అందులో సగమైనా టాలీవుడ్ రాబడుతుందా అంటే డౌటే అంటున్నారు. మొత్తానికి ఈ దసరా కూడా టాలీవుడ్ ని ఆదుకోలేదు అన్నది తేలిపోతోందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: