టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో ట్విట్టర్ లో ఉన్నంత యాక్టివ్ గా సినిమాలలో ఉండటం లేదు. ముఖ్యంగా వివాదాస్పద ట్వీట్ లతో అందరినీ ఎంతగానో చిరాకు పెట్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ మంచి మంచి సినిమా లు చేస్తే బాగుంటుందని శివ లాంటి సినిమా లు ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. కానీ రోజురోజుకు ఆర్జివీ చేష్టలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు. పిచ్చి పట్టినట్టుగా అదే పనిగా అందరినీ విసిగిస్తూ ఉన్నాడు ఈ దర్శకుడు.

ఇక ఓ టీ టీ శకం ఆరంభమైన తర్వాత రోజుకో సినిమా చేస్తూ దాన్ని విడుదల చేస్తున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ.  సినిమా తెరకెక్కించడం అంటేనే చాలా చీప్ అనేంతగా ఆయన సినిమాలు తెలుగు లో విడుదల చేస్తుండటం గమనార్హం. కాంట్రవర్సీ నే ఎజెండా గా మార్చుకొని వివాదాస్పద దర్శకుడిగా మారిన ఈయన మంచి చిత్రాలతో ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి వర్మ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమా చేయడానికి ముందడుగు వేస్తున్నాడు.

కన్నడలో విభిన్నమైన చిత్రాలను చేసి స్టార్ హీరోగా ఎదిగిన ఉపేంద్ర తో వర్మ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధమైన స్క్రీన్ ప్లే తో పాటు సమాజానికి మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరి వీరిద్దరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దొందూదొందే కావడం.. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే సినిమా చేయడం వంటివి చూస్తుంటే ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి. సెప్టెంబర్ 18వ తేదీన ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆర్జివీ ఆయనకు స్పెషల్ విషెస్ చెప్పగా త్వరలోనే ఆయనతో యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: