సాఫ్ట్‌వేర్ బూమ్‌ మొదలయ్యాక, తెలుగునాట ఫారెన్‌ సంబంధాలకి క్రేజ్ పెరిగింది. గ్రీన్‌ కార్డ్‌ అల్లుళ్లకి డిమాండ్ రోజురోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. అయితే కామన్ పబ్లిక్‌లోనే కాదు, సెలబ్రిటీస్‌లోనూ ఈ ఫారెన్ పెళ్లిల్లకి క్రేజ్ ఉంది. విదేశియుడిని పెళ్లి చేసుకుని, ఫారెన్‌లో స్థిరపడుతోన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

ఎవరైనా ఒక అమ్మాయి ఫారెనర్‌ని పెళ్లి చేసుకుంటే అంతా చిత్రంగా చూస్తుంటారు. 'పడమటి సంధ్యారాగం' స్టోరీని లైవ్‌లో చూస్తున్నామని ఆశ్చర్యపోతుంటారు. అయితే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇలాంటి 'పడమటి సంధ్యారాగాలు' చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఫారెనర్స్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నటైమ్‌లో షాహిద్‌ కపూర్‌ని పెళ్లి చేసుకుంటుందని, రణ్‌బీర్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉందని చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే ప్రియాంక మాత్రం బాలీవుడ్‌ లవ్స్‌ అన్నింటిని పక్కనపెట్టి, అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ నిక్‌ జోనస్‌ని పెళ్లి చేసుకుంది. మిసెస్‌ నిక్‌గా మారాక ఇండియన్ ఇండస్ట్రీకి దూరమై, హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది ప్రియాంక జోనస్.

ప్రీతీ జింటా సినిమాల నుంచి ఐపీయల్‌లో అడుగుపెట్టినప్పుడు బోల్డన్ని లవ్‌ స్టోరీస్‌ వినిపించాయి. యువరాజ్‌ సింగ్‌తో ప్రీతీ జింటా క్లోజ్‌గా మూవ్‌ అవుతోందని, ఆస్ట్రేలియన్‌ క్రికెట్ ప్లేయర్ బ్రెట్‌లీతో డేటింగ్‌లో ఉందని ప్రచారం జరిగింది. అయితే ప్రీతీ మాత్రం అవన్నీ బేస్‌లెస్‌ ర్యూమర్స్‌ అని స్టేట్మెంట్స్‌ ఇచ్చింది. 2018లో అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌ జెన్‌ గుడ్‌ఎనఫ్‌ని పెళ్లి చేసుకుంది ప్రీతి.

బోల్డ్‌ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ రాధిక ఆప్టే. హిందీ నుంచి తెలుగు వరకు నటించిన ప్రతీ చోట సూపర్ పెర్పామర్‌ అని పేరు తెచ్చుకున్న రాధిక, లండన్‌ మ్యూజీషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని పెళ్లి చేసుకుంది. 2012లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ లాంగ్‌రిలేషన్‌లోనే ఉన్నారు. రాధిక సినిమాల కోసం ఇండియాలో ఉంటే, బెనెడిక్ట్‌ లండన్‌లో ఉంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: