ఇటీవల కాలంలో సంగీత ప్రపంచంలో సెన్సేషనల్ క్రియేట్ చేసినట్లుగా పాటలు పాడుతూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్న గాయకుడు రామ్ మిరియాల.  ప్రైవేట్ బ్యాంద్ ఏర్పాటు చేసుకుని వాటిలో మంచి మంచి పాటలు చేస్తూ సినిమా పరిశ్రమలో అవకాశం దక్కించుకుని ఇప్పుడు ఇంత దూరం వచ్చి గుర్తింపు దక్కించుకున్నాడు. చౌరస్తా బ్యాండ్ అనే ఓ మ్యూజిక్ సంస్థ ను ఏర్పాటు చేసి యూట్యూబ్ లో పలు పబ్ లతో పాటలు పాడుతూ ప్రజలలో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత సినిమాలలో ప్రయత్నించి గాయకుడిగా సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు ఏ సినిమాలో చూసిన మొదటి పాట ఈయనే పాడుతూ ఉండడం విశేషం. అంతేకాకుండా ఇటీవలే సంగీత దర్శకుడిగా కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు రామ్. పెద్ద హీరోలు సైతం ఆయనను తమ సినిమాలలో పాటలు పాటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కొన్ని చిన్న చిత్రాలకు సంగీతం అందించడమే కాకుండా గాయకుడిగా కూడా పాటలు పాడి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది గాయకులు ఉన్నా కూడా దర్శక నిర్మాతలు ఈయన వెంటే పడడం ఆయనకు ఎంత క్రేజ్ ఉందో చెబుతోంది.

మరి భవిష్యత్తులో ఈ సింగర్ కం సంగీత దర్శకుడు నుంచి ఎలాంటి సంచలనాత్మక పాటలను వినాల్సి వస్తుందో చూద్దాం. ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ ఆలపించగా ఈ పాటతో ఆయన రేంజ్ మరో స్టేజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇతర స్టార్ హీరోలతో కూడా ఆయన పనిచేసే అవకాశం ఉన్నట్లుగా తాజాగా కొంత సమాచారం అందుతుంది. కష్టపడి దేనిమీదైనా సాధన చేస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పించి నెంబర్ వన్ స్థానానికి ఎదగొచ్చు అన్నదానికి మిరియాల కెరీరే నిదర్శనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: