తెలుగు సినిమా చరిత్రలో సింగర్ గా స్మిత ఎన్నో పాటలతో ప్రేక్షకులను ఇప్పటివరకు అలరిస్తూ వచ్చింది. నటి గా కూడా కొన్ని చిత్రా ల్లో ముఖ్యపాత్ర లు పోషించి న ఈమె తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ కన్నడ సినిమాలలో పాటలు పాడుతూ దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈమె మల్లీశ్వరి ఆట వంటి చిత్రాల్లో నటించి నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది.

కొన్ని ఆల్బమ్ పాటల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నర్తకి కూడా.. తెలుగులో మొట్టమొదటి ఆల్బమ్ ను రూపొందించిన సింగర్ గా నిలిచింది స్మిత. 1980 వ సంవత్సరంలో జన్మించిన ఈమె స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుంచి పాటల పట్ల ఎంతో ఆసక్తి ఉండడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. అలా ఈటీవీ నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని ఫైనల్లో చేరింది. అక్కడ మాత్రం మంచి గుర్తింపు సాధించింది.

ఈ క్రమంలోనే ఆమెకు సినిమాలలో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు ఆమె గొంతు పాప్ సంగీతానికి సరిపోతుందని భావించి ఆ రంగంలో కృషి చేయమని సలహా ఇవ్వగా అలానే ఎన్నో పాటలను రూపొందించి ప్రజలలో మంచి గుర్తింపు దక్కించుకుంది. గాయనిగా నటిగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఈమె అడుగుపెట్టింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో ఓ సెలూన్ ప్రారంభించి వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యింది. పాత పాటలు రీమేక్ చేసి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఓ ఎన్ జీ వో ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తుంది. త్వరలో రాజకీయాల్లోకి కూడా ఈమె రాబోతున్నట్లు గా సమాచారం అందుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: