"ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళని దు" ఆ లిరిక్స్ కి తగ్గట్లే మనకి కూడా తన పాటలు వినకుంటే ఊసుపోదు, తన మెలోడియస్ వాయిస్ వినకుండా ఉండలేము, హేమ చంద్ర వాయిస్ అలాంటిది మరి.

రియాలిటీ టాలెంట్ హంట్ షోస్ ద్వారా తనలో ఉన్న అద్భుతమైన గాయకుడిని ప్రేక్షకులకు పరిచయం చేసి, అందరి హృదయాల్లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని క్రీస్తే చేసుకున్న హేమ చంద్ర 2006 లో హిమేష్ రేష్మియా గారు  మ్యూజిక్ డైరెక్టర్ గ చేసిన  దిల్ దియా హై సినిమా లో   "చలో దిల్దార్ చలో" అనే పాట తో హిందీ లో డెబ్యూ చేసాడు.

2007 లో మణిశర్మ గారి డైరెక్షన్ లో "లక్ష్యం" సినిమాలో "నిలువవే" పాటతో తెలుగు లో సింగర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన చందు కి వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు.


అటు పాటలే కాదు తనలో ఇంకా ఎన్నో ట్యాలెంట్ ఉన్నాయి అని ప్రూవ్ చేసుకున్నాడు.

తనలో సింగర్ ఏ కాదు ఒక మంచి హోస్ట్ కూడా ఉన్నాడు అని జనాలకి 'బోల్ బేబీ బోల్', సరిగమప లిటిల్ ఛాంప్స్' వంటి షోస్ కి హోస్టింగ్ చేసి హోస్ట్ గ తన సత్తా చూపించాడు.


పాట లే కాదు మాటల తో కూడా మేజిక్ చేస్తాడు చందు-ధ్రువ లో  అరవింద స్వామి కి  , సవ్యసాచి లో మాధవన్ కి , స్నేహితుడు సినిమా లో విజయ్ కు , గడ్డలకొండ గణేష్ మూవీలో అతర్వ కి , ఒక క్షణంలో అరుణ్ కుమార్ కి దుబ్బింగ్ చెప్పాడు. ఇవే కాకుండా ఇంకొందరు ఆర్టిస్టులను కూడా దుబ్బింగ్ చాపి తన వాయిస్ తో జనాలని పిచ్చెకిస్తున్నాడు చందు.


రైడ్ ,మా నాన్న చిరంజీవి, ఆల్ ది బెస్ట్,రామసకని రాకుమారుడు వంటి చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేశారు హేమ చంద్ర.

 తనలో ఒక సింగర్ ను , మ్యూజిక్ డైరెక్టర్ ను , హోస్ట్ ను , దుబ్బింగ్ ఆర్టిస్ట్ ను మనందరికీ ప్రాచ్యం చేసాడు. మరి నెక్స్ట్ ఇంకేం హిడెన్ టాలెంట్ ని చూపెడతాడో…..చుదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: