రేసుగుర్రం సినిమాలో "సినిమా చూపిస్తా మావ నీకు సినిమా చూపిస్తా మావ" అనే మాస్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ పాట వింటుంటే ఆ పాట పాడిన సింగర్ సింహ ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. మాస్ పాటలకు ఆయన పెట్టింది పేరు. స్టేజ్ పై సందడి చేయాలన్నా వెండి తెరపై తన స్వరంతో అదరగొట్టాలన్నా తనకు తానే సాటి. 'నేను పెళ్లికి రెడీ’ చిత్రం లో ‘నీవు నేను ఒకటేలే..’ అనే మెలోడీ పాటతో గాయకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సింగర్ సింహ. పాటని పాడటం మాత్రమే కాదు దాన్ని ఆస్వాదిస్తూ స్వరం అందించడం ముఖ్యం అందులో సింహ ఎపుడు ముందుంటారు. పాడేది తెర వెనకే అయిన ఆ హుషారు స్వరంలో వినపడుతుంది. ఈయన గొప్ప స్టేజ్ పర్ఫార్మర్ కూడా, వేదిక మీద పాడుతున్నప్పుడు స్టెప్పులు వేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతాడు.

సింహా ఉంటే ఇక స్టేజ్ అంతా సందడే సందడి ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని అందరూ అంటుంటారు. లయన్ చిత్రంలో ‘పిల్లా నీ కళ్లకున్న కాటుకేమో సూపరే’ , ఆగడు మూవీలో ‘అరే జంక్షన్లో.. జంక్షన్లో..’ వంటి ఎన్నో స్టార్ హీరో చిత్రాల్లో పాటలకు తన గాత్రం అందించారు సింహ.  ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మొదట్లో ఓ ప్రోగ్రామ్ లో సింహ పాట విని ఛాన్స్ ఇచ్చి గురువుగా మారారు. ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ఈ స్థాయికి ఎదిగారు సింహ.  సి.ఏ. చదివిన సింహ ఓ వైపు పాటలు పాడుతూనే మరోవైపు  పాటలు పాడుతుంటారు. ఇప్పటికీ దాదాపు 200 పాటలకు పైగా పాటలు పాడిన..ఎన్నో పాటలు సూపర్ హిట్ అందుకున్న రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.

సంగీతంలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి చక్రి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, తమన్ వంటి గొప్ప సంగీత దర్శకుల ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలను అందుకుని ముందుకు సాగుతున్నారు సింహ. భరత్ అనే నేను పాట సింగర్ సింహ కు హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: