టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం చరణ్ , ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

అలానే ఈ మూవీ నుండి దోస్తీ సాంగ్ కూడా విడుదలై మంచి క్రేజ్ దక్కించుకుంది. అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు టాక్. అయితే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు రాజమౌళి. కె ఎల్ నారాయణ నిర్మాతగా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ విషయమై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ పాత్ర ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉండేలా కథని సిద్ధం చేస్తున్నారట. కీరవాణిమూవీ కి మ్యూజిక్ అందించనుండగా టాలీవుడ్ తో పాటు పలువురు ఇతర భాషలు, అలానే హాలీవుడ్ నిపుణులు కూడా ఈ మూవీ కోసం పని చేయనున్నట్లు చెప్తున్నారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీ నిర్మాణ భాగస్వామ్యంలో సూపర్ స్టార్ మహేష్ సొంత సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా పాలు పంచుకోనుందని, త్వరలో దీనిపై అధికారికంగా న్యూస్ కూడా రానుందని సమాచారం. ఇప్పటి వరకు తాను నటించిన పలు సినిమాలు ఇతర సంస్థలతో కలిసి నిర్మించిన మహేష్, ఈ భారీ ప్రాజెక్ట్ లో కూడా తన సంస్థని భాగస్వామిని చేయనున్నారట. కాగా ఈ మూవీ ఇండియన్ మూవీ హిస్టరీ లో నిలిచిపోయేలా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: