టాలీవుడ్ లో చైతు, సామ్ ల జంటకి ఉన్న క్రేజ్ మరే సెలబ్రిటీ జంటకి లేదంటే అతిశయోక్తి కాదు అంటుంటారు వారి ఫాలోయింగ్ అలాంటిది మరి. "ఏం మాయ చేశావే" సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి తరవాత కూడా వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కెరీర్ పై తనకున్నఆసక్తిని కనబరిచింది సామ్. అయితే ఇదే ఈ విషయమై వీరి మధ్య మనస్పర్ధలు పెరిగాయని ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎటు చూసినా చైతు, సామ్ ల గురించి ఇవే వార్తలు. ప్రస్తుతం సమంత బిజీ షెడ్యుల్ తో వరుస షూటింగ్స్ లో మునిగిపోయారు. తన చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ బిజీ సినీ లైఫే తన కాపురానికి బ్రేకులు వేసింది అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. సామ్ కూడా అక్కినేని అమలల కుటుంబ బాధ్యతను పూర్తిగా తీసుకుని సినిమాలకు కాస్త దూరంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులు సామ్ కు గట్టిగానే చెప్పారని, అయితే అది ఏమాత్రం ఇష్టం లేని సమంత కుదరదని తేల్చి చెప్పేశారట. దాంతో చైతు కి సామ్ కి మధ్య గ్యాప్ పెరిగిందని చిన్న విషయం కాస్త వివాదంగా మారి విడాకుల వరకు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. సమంత ఇంస్టా గ్రామ్ లో తన పేరు ముందున్నఅక్క ఇంటి పేరు అక్కినేని అని తీసేయడంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది.

ఇంకేముంది ఇప్పుడు ఈ అంశంపై వార్తల తుఫాను మొదలయ్యింది. ఇప్పటి వరకు ఈ విషయంపై అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ స్పందించకపోవడంతో ఇవన్నీ మరింత పెరిగాయి. తాజాగా ఈ విషయానికి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలకు ఇక పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారట సమంత. త్వరలోనే అసలు సంగతి ఏంటన్న విషయం చెప్పి ఈ పుకార్ల మేటర్ ని క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నారని సామ్ సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. మరి ఇంతకీ సామ్ నిజంగానే ఈ వార్తలకు ఎండ్ కార్డ్ వేయనున్నారా...ఇంతకీ ఏం చెప్పనున్నారు అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు అక్కినేని అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: