బిగ్ బాస్ రియాలిటీ షో నిజానికి మన ఇండియన్ కాన్సెప్ట్ అస్సలు కాదు. మన దగ్గర ఇలాంటి షోలు అస్సలు వర్కవుట్‌ అవ్వవని చాలా రోజుల నుంచి ఎంతో మంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారని తెలుస్తుంది.

అయినా కూడా అన్నీ పక్కన పెట్టి బాగా ఆర్భాటం చేసి షో మొదలు పెట్టారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 2017లో మొదలైన బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్ భారీ విజయం సాధించింది.దానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ బలంగా మారిందని తెలుస్తుంది. ఆ తర్వాత నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక మూడో సినిమా నుంచి నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్ గా మారిపోయాడు. ఇప్పుడు కూడా ఈ షోకు బాగానే రేటింగ్ వస్తుందని సమాచారం.అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే బిగ్‌బాస్ రియాలిటీ షోను ఎవరు అయితే ఇష్టపడతారో వారి అందరి కంటే ఎక్కువమంది దీన్ని విమర్శిస్తుంటారని తెలుస్తుంది.

బిగ్‌బాస్ షో వల్ల అస్సలు ఉపయోగమేంటి? ఇంట్లో ఆడ మరియు మగ చేసుకునే రొమాన్స్ అలాగే వాళ్లు వేసే జోక్స్‌ మరియు సిగ్గులేకుండా వాళ్లు చేసే వెకిలి చేష్టలు కెమెరాల్లో బంధించి ప్రేక్షకులకు చూపించడం వల్ల ఉపయోగం ఏంటి అని చాలామంది ఈ షోపై విరుచుకు పడుతూనే ఉన్నారని తెలుస్తోంది.అయితే మిగిలిన భాషలతో పోలిస్తే మన బిగ్‌బాస్ ఇంకా కాస్త పద్ధతిగా సాగుతుందనే చెప్పేవారు వున్నారట. హిందీలో అయితే మరీ విచ్చలవిడితనం పెరిగిపోయిందని సమాచారం.. తెలుగులో మాత్రం చాలా పద్ధతిగా సెన్సార్‌తో ఈ షో నడిపిస్తున్నారని అందరూ అంటున్నట్లు తెలుస్తుంది.అయితే సీజన్ 5 మొదలైన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగా సెన్సార్ చేస్తున్నారా లేదా అనిపిస్తుందని తెలుస్తుంది.

ఎందుకంటే నామినేషన్ సమయంలో ఉమాదేవి మాట్లాడిన బూతు మాటలు రెండు తెలుగు రాష్ట్రాలు అస్సలు మర్చిపోవు. ఆ మాటలు వినలేక షణ్ముఖ్ జస్వంత్ ఏకంగా చెవులు మూసుకున్నాడని సమాచారం. దాంతో పాటు మరికొందరు కూడా ఇష్టం వచ్చినట్లు నోరుజారి మాటలు తూలుతున్నారని తెలుస్తుంది. ఇక రొమాన్స్‌కు అయితే హద్దూ పద్దూ లేకుండా పోతుందని తెలుస్తుంది. ఇంట్లో అమ్మాయిల గ్లామర్ షో కూడా అలాగే ఉందని సమాచారం. ఇవన్నీ చూసిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు కూడా వెంటనే బిగ్‌బాస్ షో బ్యాన్ చేయాలంటూ రోడ్డెక్కుతున్నారని సమాచారం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఆ షోలో పాల్గొని బయటికి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ కూడా బిగ్‌బాస్‌పై విమర్శలు చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఇన్ని విమర్శల మధ్య బిగ్ బాస్ ఇంకా ఎన్ని సీజన్స్ ఇలాగే విజయవంతంగా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: