రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తీస్తున్న గ్రాండ్ మూవీ రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పేట్రియాటిక్ డ్రామా మూవీగా 1920ల ముందు జరిగే కథగా ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మెగా, నందమూరి ఫ్యాన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలా అత్యద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించారట రాజమౌళి.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుండగా మరొకవైపు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ తో పాటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ రెండూ కూడా ప్రేక్షకాభిమానులని ఎంతో ఆకట్టుకుని మూవీపై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. అలానే కొద్దిరోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరిచిన దోస్తీ సాంగ్ కూడా రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా అలరించింది.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ని వచ్చే నెలలో దసరా పండుగ రోజున రిలీజ్ చేసేలా యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉండగా మిగతా సాంగ్స్ ని కూడా ఆ తరువాత ఒక్కొక్కటిగా పక్కాగా ప్లానింగ్ తో రిలీజ్ చేయనున్నారట. ఇండియా తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని నందమూరి ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: