టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. అయితే 2020 సంవత్సరం లో విడుదలైన అలా వైకుంఠపురంలో సినిమా... అన్ని రకాల ఫ్యాన్స్ ను అలరించింది.  గతేడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలై ఎన్నో రికార్డులను సృష్టించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో... గీత ఆర్ట్స్ అండ్ హారిక, హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే లు హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే సీనియర్ నటి టబు, జయరామ్, హీరో సుశాంత్, నవ దీప్, హీరోయిన్ నివేద పేతురాజ్, సముద్రఖని మరియు మురళి శర్మ తదితరులు ఈ సినిమాలో నటించారు.

అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠ పురం లో సినిమా 100 కోట్లతో తెరకెక్కింది. ఇంత భారీ బడ్జెట్ సినిమా ను వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు నిర్మాతలు.  కథాంశం నచ్చడంతో సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే... అల్లు అర్జున్ చిన్నప్పుడే... తన కుటుంబానికి దూరమవుతాడు. ఓ పేద కుటుంబంలో ఉంటూ మిడిల్ క్లాస్ లైఫ్ ను అనుభవిస్తాడు. అటు అల్లు అర్జున్ స్థానంలో సుశాంత్ ధనిక కుటుంబంలో పెరుగుతాడు. చిన్నతనంలో... అల్లు అర్జున్ మరియు సుశాంత్ లను తమ తల్లుల నుంచి వేరు చేస్తారు మురళి శర్మ.

ఈ నేపథ్యంలోనే.. మురళీకృష్ణ దగ్గర  అల్లు అర్జున్ పెరగగా... టబు దగ్గర  సుశాంత్ పెరుగుతాడు. అయితే ఈ విషయం ఆ ఆసుపత్రి నర్సు ద్వారా అల్లు అర్జున్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన సొంత గూటికి చేరి ఆ ఇంటి సమస్యలను తీరుస్తాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే ఫైటింగ్ సీన్లు మరియు కామెడీ సీన్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఈ అన్ని సీన్లను త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించాడు.

రికార్డులు : తెలుగు సినిమా చిత్రపరిశ్రమలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది అలా వైకుంఠపురం లో సినిమా. ఎన్నో రికార్డులు సాధించిన బాహుబలి 2 సినిమా  తర్వాత నిలిచింది అలా వైకుంఠపురం లో సినిమా. కేరళ  మలయాళంలో డబ్ చేసిన  ఈ మూవీ... మొదటి రోజే 30 బెని ఫిషరీ షో లలో నడిచింది. అంతేకాదు ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ కు మలయాళంలోనూ ఫ్యాన్స్ బీభత్సంగా పెరిగిపోయారు. అలాగే ఈ సినిమాలోని బుట్ట బొమ్మ అనే పాట యూట్యూబ్ లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికీ ఈ పాట జనాల నోళ్ళలో నానుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: