తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ గా  కొనసాగుతున్న  ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అటు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసే ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమా కావడం గమనార్హం. కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ప్రభాస్. అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహో. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.



 ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నటించింది.  సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భిన్నమైన టాక్ సొంతం చేసుకుంది. కొంతమంది సినిమా బాలేదు అంటే మరి కొంత మంది మాత్రం సినిమా బాగుంది అంటూ రివ్యూస్ ఇచ్చారు.  ఇలా వచ్చిన మిక్స్డ్ రివ్యూస్ ఈ సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపించలేకపోయాయ్ అని చెప్పాలి.  మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.



 ఇక సాహో కలెక్షన్స్ విషయానికి వస్తే పూర్తిగా ఇండియా వైడ్ గా 359 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది సాహో సినిమా. ఇక అటు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటిన సాహూ 92 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఇండస్ట్రీ వారిగా చూసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో 168 కోట్ల వసూళ్లు రాబట్టింది  ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో 177 కోట్ల రూపాయల వసూళ్లు   తమిళ ఇండస్ట్రీలో 11 కోట్లు.. మలయాళ ఇండస్ట్రీలో మూడు కోట్ల రూపాయలు వసూలు వచ్చాయి. ఇలా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ సాహో సినిమా మాత్రం అద్భుతంగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: