అరవింద సమేత వీర రాఘవ.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు ప్రతిరూపంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన  ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పాలి.  బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.  ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అటు నిర్మాతల పంట పండింది అని చెప్పాలి. ఈ సినిమాతో అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతగానో లాభం పొందారు.  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.



 ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మనుషుల మధ్య కావాల్సింది ప్యాక్షన్ కాదు  బ్రతకాలనె ఆశ అన్న ఒక మెసేజ్ ఇచ్చింది.  సినిమాలో అన్ని పాత్రలు కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అటు వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది ప్రేక్షకులకు.  ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన 5వ సినిమాగా రికార్డు సృష్టించింది.



 ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అరవింద సమేత వీర రాఘవ సినిమా. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 108.9 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక అటు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 158.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక థియేట్రికల్ హక్కుల కోసం 91 కోట్ల ను రాబట్టింది అరవింద సమేత సినిమా.  ఇలా సూపర్ డూపర్ హిట్ సాధించిన అరవింద సమేత సినిమా అటు వసూళ్లలో కూడా బాక్సాఫీసును షేక్ చేసింది అని చెప్పాలి. అటు ఎన్టీఆర్ కెరియర్లో  బిగ్గెస్ట్ హిట్ గా కూడా ఈ సినిమా నిలిచింది. అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: