రవితేజ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. అలాంటి మంచి సినిమాలలో 'విక్రమార్కుడు' సినిమా ఒకటి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించాడు. ఈ సినిమాలో రవితేజ అత్తిలి సత్తిబాబు పాత్రలో కామెడీని పండిస్తూ, విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి జనాలను మెప్పించాడు. 23 జూన్ 2006 లో విడుదలైన ఈ సినిమా రవితేజ కు ఎనలేని గుర్తింపు తీసుకు వచ్చింది. ఏ భాషలో రీమేక్ చేస్తే ఆ భాషలో విజయవంతమైన ఇంత గొప్ప కథను అందించిన ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.

 ఇంతకాలానికి 'విక్రమార్కుడు' సీక్వెల్ కి కథను సిద్ధం చేశాడట. 'విక్రమార్కుడు' సినిమాకు మించి ఈ కథ వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా విజయేంద్రప్రసాద్ కథను  మొదట రాజమౌళికి వినిపిస్తాడు, ఎందుకంటే తన కథకు రాజమౌళి అయితేనే తగిన న్యాయం చేయగలడు అని ఆయన భావించడమే. కానీ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉండటం, ఆ తర్వాత కూడా రాజమౌళి రెండు, మూడు సంవత్సరాల వరకు కాళీగా ఉంటే అవకాశాలు లేకపోవడంతో ఈ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో విజయేంద్రప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 'విక్రమార్కుడు' సినిమా సంచలన విజయం సాధించడం, రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి గల పేరు కారణంగా బడా నిర్మాణ సంస్థలు ఈ కథను సొంతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయట. మరి ఈ కథను ఏ నిర్మాణ సంస్థ సొంతం చేసుకొని, ఏ దర్శకుడితో ఈ సినిమాను తెరకెక్కిస్తోందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: