పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ "వకీల్ సాబ్" కరోనాలోనూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్, రాత్రి కర్ఫ్యూతో సహా అనేక ఆంక్షల కారణంగా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించాల్సిన ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టి నిర్మాతల జేబులు నింపేసింది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ 89.35 కోట్లు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ లక్ష్యం రూ. 90 కోట్లు. ఈ చిత్రం క్లోజింగ్ సమయానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 135 కోట్లు రాబట్టిందనేది టాక్. 95.65% రికవరీ వరకు కలెక్షన్స్ రికవరీ అయ్యాయి.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రకటించిన నిర్మాత దిల్ రాజు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయని వెల్లడించారు. అయితే ఆ కలెక్షన్స్ ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఆంధ్రాలో ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచేయడంతో ప్రభుత్వం కలగజేసుకుంది. 'వకీల్ సాబ్' రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను పెంపును తగ్గిస్తూ స్పెషల్ జీవోను జారీ చేసింది. దీంతో అక్కడ 'వకీల్ సాబ్' టీంకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. దీంతో మెగా అభిమానులు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరికొందరు ఇది రాజకీయ రివేంజ్ అన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఏమాత్రం స్పందించలేదు సరికదా ఇప్పటికి అదే రేట్ కొనసాగుతోంది అక్కడ. ఈ రచ్చ కారణంగా దిల్ రాజు సినిమా కలెక్షన్ల గురించి వెల్లడించడానికి నిరాకరించారు.  

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహిళలపై లైంగిక వేధింపులు, వారిని సమాజం చూసే చిన్న చూపు, మహిళల ప్రాముఖ్యత చుట్టూ తిరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నివేథా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్, అనన్య నాగల్లా, శృతి హాసన్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ నటించారు. "వకీల్ సాబ్"కు థమన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎలాగైతేనేం 'వకీల్ సాబ్'కు ఎన్ని అడ్ఢనకులు వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: