తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ ఒకరు. సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా డీ మరియు ఇతర ప్రోగ్రాం లకు జడ్జి గా వ్యవహరిస్తూ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటు సినిమాలు, అటు టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం నిర్మాతగా కూడా మారాడు. యూట్యూబ్ లో శేఖర్ స్టూడియో అనే ఛానల్ పెట్టిన శేఖర్ మాస్టర్ ఇందులో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాడు. కొత్తగా ఒక వెబ్ సిరీస్ తో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. టెర్రస్ అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కోసం శేఖర్ మాస్టర్ తన సన్నిహితుల సహాయం తీసుకుంటున్నాడు.

 ఈ క్రమంలోనే ప్రియమణి, అనసూయ, ఆది వంటి వారు తమ జీవితంలో టెర్రస్ అనుభూతులను తెలియజేశారు. తాజాగా హీరోయిన్ పూర్ణ కూడా తన టెర్రస్ స్టోరీని కూడా బయట పెట్టింది.  ఈ మేరకు బయటకు వదిలిన వీడియో చాలా  వైరల్ అవుతుంది. ఈ వీడియోలో  హీరోయిన్ పూర్ణ తన టెర్రస్ స్టోరీలను వివరించింది. పూర్ణ టెర్రస్ స్టోరీ లో భాగంగా తన జీవితంలో ఎదురైన ఒక బ్యాడ్ సంఘటనను వివరించింది. శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి శేఖర్ స్టూడియోలో టెర్రస్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించాడు. నాకు టెర్రస్ లవ్ స్టోరీ లాంటివి ఏమీ లేవు.  ఎందుకంటే నా చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా నాకు బ్రదర్స్ లాంటి వారే. అయితే టెర్రస్ అంటే మాత్రం ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. చిన్న వయసులో నేను టెర్రస్ మీద నుండి కింద పడ్డాను. అప్పుడు నా తలకు పెద్ద గాయం అయింది. రెండు, మూడు నెలల పాటు హాస్పిటల్ లో ఉన్నాను. అప్పటి నుండి నాకు ఈ సమస్య ఉంది. అంటూ పూర్ణ తన టెర్రస్ స్టోరీ ని వివరించింది. శేఖర్ మాస్టర్ నిర్మిస్తోన్న టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని హీరోయిన్ పూర్ణ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: