వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.  మొదటి దశ కరోనా అయిన తర్వాత సినిమా పరిశ్రమకు భారీ హిట్ పడాల్సిన నేపథ్యంలో ఈ సినిమా విడుదలై ఒక్కసారిగా ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించింది. అంతేకాదు డెబ్యూ హీరోగా చేసిన వైష్ణవ్ చేసిన ఈ సినిమా ఆయనకు మరిచిపోలేని జ్ఞాపకం గా నిలిచిపోయింది. తెలుగులో ఇలాంటి గ్రాండ్ ఎంట్రీ ఏ హీరో కి దక్కలేదనే చెప్పాలి. ఎవరికి సాధ్యం కానీ రేంజ్లో ఈ విజయం సాధించి పెద్ద హిట్ ను సొంతం చేసుకుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసి టాలీవుడ్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి శెట్టి కి మంచి పేరు వచ్చింది. హీరోతో పాటు ఈమెకు  కూడా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పలకడం తో ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో వీరిద్దరూ జీవించారని చెప్పాలి. 

ఈ సినిమాలో మెయిన్ హైలెట్ కథ కాగా దాని తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో నే వారు ఈ సినిమాని రెండేసి మూడేసి సార్లు చూశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అయ్యింది. మొత్తానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు చేశారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి గురించి. తొలిసారి తెలుగులో ఆయన నటించడమే కాకుండా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు. వీరే కాకుండా మిగతా నటీనటులు కూడా ఈ సినిమా హిట్ అవడానికి కారణం అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: